జిమ్ లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో జరిగింది. బృందావన్ హోటల్ యజమాని ప్రదీప్ రఘువంశీ (55) ఎప్పటిలాగే గురువారం కూడా జిమ్ కు వెళ్లాడు. ట్రెడ్మిల్ పై నడిచిన తర్వాత అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను నేలమీద పడిపోయాడు. జిమ్ లో పని చేస్తున్న కొందరు యువకులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రదీప్ కొడుకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.