2023 ఆసియా కప్ టోర్నీని ఈసారి వన్డే ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ లో ఆసియా కప్ మ్యాచులు జరగనున్నాయి. మ్యాచ్ ల తేదీలను ప్రకటించాల్సి ఉంది. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా గురువారం పురుషుల ఆసియా కప్-2023ఎం, మహిళల ఆసియా కప్ 2024 వివరాలను ప్రకటించారు. పురుషుల ఆసియా కప్ లో 2 గ్రూపులు ఉంటాయి. ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉండనున్నాయి.