అంతర్జాతీయ ప్రయాణీకులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల కేసులు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య 19,227 మంది ప్రయాణీకులకు చేసిన పరీక్షల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని.. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని స్పష్టం చేశాయి. ఎయిర్ పోర్టులు, సముద్ర పోర్టులు, సరిహద్దుల్లో ఉండే ల్యాండ్ పోర్టుల్లో టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించాయి.