వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడుతూ, ఉక్రెయిన్ను అతలాకుతలం చేస్తున్న రష్యాకు మర్చిపోలేని న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది ఆదేశం. అత్యంత రహస్య ప్రదేశంలో దాక్కున్న రష్యా సైనికులు న్యూఇయర్ రోజు కుటుంబీకులతో మాట్లాడానికి ఫోన్లు ఆన్ చేస్తారని పసిగట్టారు. వాళ్లు అలా ఫోన్ ఆన్ చేయగానే ఒక ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసిన ఉక్రెయిన్ సైన్యం, డోన్టెస్క్లోని కాలేజీలో ఉంటున్నారని తెలుసుకుని వెంటనే రాకెట్ల సాయంతో మెరుపు దాడులు చేసింది. ఇందులో 300 మందికిపైగా రష్యా సైనికులు చనిపోయారు.