నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన రూ. 122 కోట్ల అంచనా బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ తుది మెరుగులు దిద్ది ఆమోదించింది. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. నగర మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే సమావేశంలో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ. నగరాభివృద్ధేధ్యేయంగా వార్షిక బడ్జెట్‌ను అంచనా వేశామన్నారు. ఆదాయ మార్గాలు పెంచుకుని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు.