ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా జోషీమఠ్ లో భూమి కుంగడంతో దాదాపు 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురై బయట ఎముకలు కొరికే చలిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం దీనికి గల కారణం తెలుసుకునేందుకు ఓ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై సీఎం నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.