ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రావికమతం మండలం గుడివాడ సచివాలయ పరిధిలో గల మట్టవానిపాలెం లో నిర్వహించిన కార్యక్రమంలో గడప గడపలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీకి ప్రజలు జన నీరాజనాలు అందించారు. ప్రతి ఇంట ఘన స్వాగతం పలుకుతూ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్త స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
పింఛన్ల నుంచి ఫీజుల దాకా. ఇళ్ల పట్టాల నుంచి అమ్మ ఒడి వరకు మూడేళ్లలోనే 98 శాతం హామీలను నెరవేర్చి ప్రజల చెంతకు చేరుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. లబ్ధిదారులకు సీఎం రాసిన లేఖలను ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండ టంతో మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులుతో కలసి ధర్మశ్రీ ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు ధర్మ శ్రీకి ఘనంగా స్వాగతం పలికారు. అర్హత ఉండి ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని, అర్హులకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు.
ఎమ్మెల్యే సందర్శిస్తున్న ప్రతీ గడపలో ప్రజలను పేరు పెట్టీ మరీ పలకరిస్తూ ముందుకు సాగారు. జగనన్న పాలనలో ఇంటింటా సంక్షేమ లబ్ది చేకూరడంసంతృప్త స్థాయిలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడంపై నిండు మనసుతో మట్టవాని పాలెం గ్రామస్తులు శాసనసభ్యులు ధర్మశ్రీ ని ఆశీర్వదించి. ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని వారి ఆకాంక్షను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వివిధ శాఖల అధికారులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.