జపాన్ లో బ్లూఫిన్ టూనా చేప భారీ ధర పలికింది. ఆవోమోరిలోని ఒమా దగ్గర 212 కిలోల చేపను పట్టుకున్నారు. దీన్ని టోక్యోలోని టొయొసు మార్కెట్ వో బహిరంగ వేలం నిర్వహించగా, 36 మిలియన్ యెన్ లు అంటే మన కరెన్సీలో రూ.2.25 కోట్లు పలికింది. భారీ సైజులో ఉండే బ్లూఫిన్ చేపను పట్టుకుని వేలం వేయడం ఆనవాయితీగా వస్తుంది. 2019లో 3.1 మిలియన్ డాలర్లు పలికిన చేప ధర కరోనా కారణంగా తగ్గుతూ వస్తుంది.