సముద్రాల్లో పరిశోదనల కోసం ఈ ఏడాదే సముద్ర యాన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దేశీయంగా నిర్మించిన నౌక ద్వారా ముగ్గురు ఆక్వానాట్స్ ను 500 మీటర్ల లోతులోకి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ ఇంజినీర్లు ప్రయాణానికి స్టీల్ గోళాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించారు. అయితే, 6 వేల మీటర్ల లోతులో చేపట్టాలనుకున్న ప్రక్రియ వాయిదా పడింది.