దేశంలో గడిచిన 24 గంటల్లో 228 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కు చేరింది. రికవరీ రేటు 98.80 శాతం ఉండగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ 220.12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.