తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో కొండుప్రోలులో జరిగింది. రెండు నెలలుగా యువతి వెంట పడుతున్న రాజులపాటి కళ్యాణ్, గురువారం అర్థరాత్రి దాటాక యువతి ఇంటికి వెళ్లి గొంతు కోశాడు. అడ్డొచ్చిన యువతి చెల్లి, తల్లిపైనా దాడి చేశాడు. వారిని గమనించిన స్థానికులు వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.