రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవో నెం.1ను వెంటనే రద్దు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. గుడివాడ, కోతిబొమ్మ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవో1ను నిరసిస్తూ తొలుత చీపుర్లతో రోడ్లను శుభ్రం చేశారు. తెలుగు మహిళ నాయకులు యార్లగడ్డ సుధారాణి, అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, మాదాల రోజా తదితరులు పాల్గొన్నారు. కాగా, జీవో నెం1ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మురాల రాజేష్ డిమాండ్ చేశారు. సుందరయ్యభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, కమిటీ సభ్యులు రేపాని కొండ, రజిని తదితరులు పాల్గొన్నారు.