కృష్ణా జిల్లా, అవనిగడ్డ , మందపాకలకు చెందిన వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి ఇస్మాయిల్‌బేగ్ పేట ధర్మచెరువు సమీపంలో జరిగింది. కోడూరులోని బట్టలషాపులో పనిచేస్తున్న వివాహిత రాత్రి ఎనిమిది గంటల సమయంలో మోపెడ్‌పై మందపాకల వెళ్తుండగా మంకీ క్యాప్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తి ఆమెను మోపెడ్ నుంచి లాగి పడేసి, ముళ్లపొదల్లోకి లాక్కు వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయటంతో అటుగా వెళ్తున్న వారు రావటంతో దుండగుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.రాజేంద్ర ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆమెను ప్రథమ చికిత్స నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవనిగడ్డ సీఐ జి.శ్రీనివాస్ బాధితురాలి వద్ద వివరాలు సేకరించారు. దుండగుడికోసం గాలిస్తున్నామన్నారు. బాధిత మహిళను అవనిగడ్డ ఆసుపత్రిలో తెలుగు మహిళలు బండే నాగవెంకట కనకదుర్గ, విశ్వనాఽథపల్లి పాప పరామర్శించారు. డిఎస్పీ మెహబూబ్ బాషాను కలిసి దుండగుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటే శ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే రాఘవ, ఘంటసాల రాజమోహనరావు తదితరులు పాల్గొన్నారు.