అంగన్వాడి హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని సిఐటియు నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హిందూపురంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్కు అంగన్వాడి హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ హెల్పర్లకు ప్రమోషన్ కల్పించాలని కోర్టుకు వేద్యం నడుస్తున్న వారి స్థానాల్లో నూతనంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఈ నోటిఫికేషన్స్ నువ్వు రద్దు చేసి అంగన్వాడి హెల్పర్లకు ప్రమోషన్ కల్పించాలని లేనిపక్షంలో కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చేంతవరకు వీటిని ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, కోశాధికారి శిరీష, సెక్టర్ లీడర్ వరలక్ష్మి, సిఐటి పట్టణ ఉపాధ్యక్షులు అత్తర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa