ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తికి గతేడాది నిశ్చితార్ధం జరిగింది. ఈ ఏడాది జనవరి 30న వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే పెళ్లికి నెల ముందే కట్నం కింద ఫార్చ్యూనర్ కారు కావాలని వరుడు కోరగా అమ్మాయి తరపు వాళ్లు వాగనార్ను బుక్ చేశారు. దీంతో ఆగ్రహించిన వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఇరు కుటుంబీకులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.