కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో వెలిసిన శ్రీ సుభ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి మూలవిరట్ కు పంచామృత అభి షేకాలు, అర్చనలు విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు పాల్గొని శ్రీ స్వామివారికి మొక్కు బడులు చెల్లించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు ఎస్. విజయ ప్రసాద్ యాదవ్ తెలిపారు.