భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు హోలులో లాయర్లందరినీ ఆశ్చర్యపరిచారు. దివ్యాంగులైన తన ఇద్దరు పెంపుడు కూతుళ్లను ఆయన విజిటర్స్ గ్యాలరీ గుండా ఫస్ట్ కోర్టుకు తీసుకువచ్చారు. తన ఛాంబర్ ను చూపించి కోర్టు పని విధానాన్ని వారికి వివరించారు. కూతుళ్లను వారి కోరిక మేరకు సీజేఐ తీసుకువచ్చారని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.