చైనాలో జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. శ్వాస సమస్యలతో భారీగా ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో ఆసుపత్రుల్లో బెడ్ లు లేక హాలులోనే నేలపై చికిత్స అందిస్తున్నారు. చైనాలోని షాంఘైలో రెండు ప్రధాన ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. బెడ్ లు నిండిపోవడంతో హాల్ లోనే రోగులకు చికిత్స అందిస్తున్నారు.