భారతీయ భాషలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని పాఠశాలల్లో పంజాబీ బాషను బోధించనున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పాఠశాలల్లో ప్రీప్రైమరీ నుండి 10వ తరగతి వరకు పంజాబీ బాషను సిలబస్ లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ 2.39 లక్షల మంది ఆ భాష మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లలో పంజాబీ మాట్లాడేవారి సంఖ్య 80శాతానికి పెరిగింది.