ఓ టైల్స్ దుకాణంలోకి చోరీకి వచ్చిన దొంగ నగదు దోచుకున్న తర్వాత తీన్ మార్ డ్యాన్స్ చేశాడు. అనంతరం సీసీటీవీలను గమనించి వాటితో పాటు డీవీఆర్ ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో జరిగింది. నగదు, ల్యాప్ టాప్ సహా రూ,లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని యజమాని తెలిపాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa