ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని రాజ్ కోట్ పట్టణ శివారులో నిర్మిస్తున్న ఓ చెక్ డ్యాంకు ప్రధాని తల్లి పేరు పెట్టనున్నారు. గిరి గంగా పరివార్ ట్రస్టు న్యారీ నది దిగువన రూ.15 లక్షలతో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టింది. ప్రధాని తల్లి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ డ్యాంకు హీరాబెన్ సరోవర్ గా పేరు పెట్టనున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు వెల్లడించారు.