భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన కొడుకుని షూ లేస్ తో ఉరేసి చంపి మృతదేహాన్ని తోటలో పడేశాడు. యూపీలోని సంభాల్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ధర్మేష్ అనే వ్యక్తి తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో కుమారుణ్ని చంపి ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa