జివిఎంసీ 64 వార్డ్ గంగవరం గ్రామంలో వైఎస్ఆర్ అర్బన్ హేల్త్ క్లినిక్ ను ప్రజా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కింద కోటి ఐదు లక్షల వ్యయంతో నిర్శాణం చేపట్టామని సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్య కి, వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖమంత్రి విడుదల రజినీ మాట్లాడుతూ గంగవరం లో ఎన్నో ఏళ్లుగా ఉన్న హెల్త్ సెంటర్ సమస్య ని ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి ద్వారా సాధ్యం అయిందని నేటీ నుండి అందుబాటులోకి వైద్య సేవలు తెచ్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దని అన్నారు. అలాగే గంగవరం లో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ని పూల వర్షం తో అభినందనలు తో తమ హర్ష ధ్వనాలు వినిపించారని అన్నారు. గంగవరం పోర్ట్ లో ఉన్న సమస్య లు ను, అలాగే ఉద్యోగులు పడుతున్న బాధలను మంత్రి దృష్టి కి తీసుకువెళ్లారు. జట్టి నిర్మాణం, అర్ అర్ ప్యాకేజీలను కూడా త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి ద్రుష్టి కి తీసుకువెళ్లి పరిష్కరిస్తాo అని అన్నారు.
కార్యక్రమంలో గాజువాక నియోజక వర్గ ఇంఛార్జి తిప్పలదేవన్ రెడ్డి, 64వ వార్డు కార్పొరేటర్ దళ్లి గోవింద్, 64వ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, 73 వ వార్డు కార్పోరేటర్లు భూపతి రాజు సుజాత, 65వ వార్డ్ కార్పొరేటర్ కేబుల్ మూర్తి, 66వ వార్డ్ కార్పొరేట మహమ్మద్ ఇమ్రాన్ , 61వ వార్డ్ కార్పొరేటర్ రాజన రామారావు , ఈగలపాటి యువశ్రీ, పల్లాచిన్నతల్లి, పూర్ణానంద శర్మ, జోన్ 6 జోనల్ కమీషనర్ సింహచలం , కార్యకర్తలు పాల్గోన్నారు.