జీవియంసి 6వ వార్డు కె 1 కోలనీ (సచివాలయం 41) శుక్రవారం నాడు జరిగిన వైయస్సార్ నూతన పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం లో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. అనంతరం 5, 6, 7, 8, వార్డు లోకి సంబందించిన నూతన పెన్షన్ దారులకు ఆయన చేతులు మీదుగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డు అత్యధిక జనాభా కలిగిన వార్డు పేద మధ్యతరగతి ధనిక అన్ని వర్గాలు వారు ఉండటానికి అనువైన ప్రాంతం ఈ వార్డు లో అత్యధిక నిదులు తో మౌళిక సదుపాయాలు తో సుందరీకరణగా తీర్చిదిద్దడంతో పాటు పార్క్ లు , వాకింగ్ ట్రాక్ లు , డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు, సిసి రోడ్డు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని శుక్రవారం నూతనంగా చాలా మందికి పెన్షన్లు అందుకున్న వారి మనసులో ఉన్న మాటలు వింటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అర్థం అవుతుందని ఆయన పేదల పక్షపాతి అని వారి కళ్ళల్లో ఆనందమే చూడాలన్నదే ఆయన ద్యేయం అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీవియంసి కార్పోరేటర్ లు, వార్డు ఇంచార్జ్ లు, వార్డు ప్రెసిడెంట్ లు, ఆయా పదవుల్లో ఉన్న వారు , సచివాలయం కన్వినర్ లు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.