ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ మరో షాక్ ఇచ్చాడు. సింగపూర్ కు చెందిన ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ మెయిల్స్ పంపినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. వీరిలో ఆసియా- పసిఫిక్ సైట్ ఇంటిగ్రిటీ హెడ్ నూర్ అజార్ బిన్, రెవిన్యూ పాలసీ సీనియర్ డైరెక్టర్ అనలుయాసా సైతం ఉన్నారు. ఈ తొలగింపులపై ట్రస్ట్ అండ్ సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లా ఇర్విన్ స్పందిస్తూ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ లో కొంతమందిని ఫైర్ చేసిందని ధృవీకరించారు.