విశాఖపట్నం నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 66 కేజీల గంజాయి ముఠాను పట్టుకున్న నేపథ్యంలో ఒంగోలు సిఐ రాంబాబును జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ అభినందించారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం సీఐను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డి. ఎస్. పి నాగరాజు, ఒంగోలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa