మునగ పువ్వులు, ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ విటమిన్లతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి. మునగ పువ్వులు, ఆకులలో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ ఆమ్లం, ఫోలిక్, ఫినోలిక్ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. జీర్ణవ్యవస్థకు, జుట్టు పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.