పంజాబ్ ఫిరోజ్ పుర్ జిల్లాలోని షాహీద్ గురుదాస్ పాఠశాల ప్రిన్సిపల్ రాకేశ్ శర్మ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బోర్డు పరీక్షల్లో మెరిట్ సాధిస్తే తన సొంత ఖర్చుతో కోరుకున్న ప్రాంతానికి విమానంలో పంపుతానని చెప్పాడు. దీంతో ఇద్దరు టెన్త్, ఇద్దరు 12వ తరగతి విద్యార్థినులు మెరిట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 12వ తరగతి విద్యార్థులను అమృత్ సర్ నుండి గోవాకు విమానంలో పంపించాడు.