కర్ణాటకలోని మడికేరి జిల్లాలో విషాదం నెలకొంది. కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పిల్లలతో సరదాగా ఆడుకున్న బాలుడు కాసేపటికి గుండెలో నొప్పిగా ఉందని తల్లడిల్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా, గుండెపోటువల్ల అప్పటికే పిల్లాడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. చిన్నారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవట.