న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్ జగన్కు, తమకు అపార గౌరవం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌరవంగా అమలు చేస్తామని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.