ప్రతిపక్షం ప్రతి విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అన్నమయ్య జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అధికారం కోసం ఎంతకైనా టీడీపీ దిగజారుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన జీవో నంబర్.1 ని చీకటి జీవో అని టీడీపీ గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. ఆ జీవో అన్ని పార్టీలకూ వర్తిస్తుందని చెప్పారు. నడిరోడ్లపై సభలు, సమావేశాలు పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉదేశ్యంతో ప్రభుత్వ అనుమతితో ఖాళీ మైదానాలలో, ప్రదేశాలలో సభలు పెట్టుకోమని ప్రభుత్వం చెపుతున్నా, ప్రతిపక్షం అడ్డుగోలుగా మాట్లాడడం దారుణమన్నారు.