ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపులను చంద్ర‌బాబుకు తాకట్లుపెట్టేందుకు ప‌వ‌న్‌ ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 12:05 PM

పవన్ క‌ల్యాణ్ అనే వ్యక్తి పావలాకో, పదికో, పరకకో లాలూచీ పడి ఈ రాష్ట్రంలో తనను నమ్ముకుని ఉన్న కాపు సామాజికవర్గ ఓటర్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి తీసుకెళ్తాడు తప్ప జరిగేది.. ఒరిగేదేమీ లేదని జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు భేటీపై మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. వారిద్ద‌రి భేటీపై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘మేం పరస్పర పరామర్శలు చేసుకుంటున్నాం’.. అని చంద్రబాబు, పవన్ చెబుతూ వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తొలి నుంచి ఏం చెబుతున్నారో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇవాళ అదే చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడ‌ని, వారిద్ద‌రూ సీట్లు సర్దుబాటు చేసుకోబోతున్నారని, పదో, పరకో తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేసేందుకు పవన్ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com