రాత్రిపూట రైళ్లలో నిద్రించే వారికి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేర IRCTC ఈ రూల్స్‌ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం రైలులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడడం, పెద్దగా సంగీతం వినడం, అరవడం లాంటివి కూడా చేయకూడదు. ఎవరైన ఈ రూల్స్‌ని పాటించకపోతే ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు.