టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రానున్న ఆరేడు నెలలు పంత్ క్రికెట్ కు దూరం కానున్నాడు. అయినా అతడి మొత్తం జీతం చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఏ లో ఉన్న పంత్ కు ఏడాదికి రూ.5 కోట్లు జీతం అందనుంది. అలాగే పంత్ ఐపీఎల్-2023 ఆడకపోయినా, రూ.16 కోట్ల వేతనం చెల్లించాలంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ను బీసీసీఐ ఆదేశించింది.