బీట్‌రూట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోడియం, ఐరన్, పొటాషియం, విటమిన్ బి-6, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పోషకాలు బీట్‌రూట్‌లో లభిస్తాయి. బీట్‌రూట్ జ్యూస్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫోలేట్ గుండె ఆరోగ్యానికి మరియు మాంగనీస్ ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.