చాలా మందికి చిన్న వయసులోనే ముఖంలో ముడతలు వస్తాయి. అలాంటివారు ఆహారంలో బాదంపప్పును చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖంపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్ (విటమిన్-ఇ), అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు ఇంకా పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి.