పోషకాహార లోపం, విటమిన్ డి లోపంతో బాధపడేవారు రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు తింటే కంటి సమస్యలు దూరమవుతాయి. గుడ్డులోని కాల్షియం జుట్టు, చర్మం మరియు గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుడ్లు తినడం వల్ల కాలేయ వ్యాధులు, ధమనులు గట్టిపడటం మరియు నరాల సమస్యలు రాకుండా ఉంటాయి. గుడ్డు గుండెకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.