ముంబైకి చెందిన అనిందితా ఛటర్జీకి ట్రావెలింగ్ అంటే మహాసరదా. దీంతో 2017లో ఇన్ స్టాగ్రాం పేజీ ప్రారంభించి ట్రావెలింగ్ మొదలుపెట్టారు. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి కూడా ఆమె ట్రావెలింగ్ కొనసాగించారు. గర్భవతిగా నాలుగు దేశాల్లో పర్యటించి, కాన్పు అయ్యాక కేవలం 45 రోజులే విశ్రాంతి తీసుకున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 87 దేశాల్లో పర్యటించారు. మహిళలు తమ కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించాలని ఆమె తెలిపారు.