కొద్దిరోజులుగా తీవ్రమైన చలి, పొగమంచు ఢిల్లీ వాసులను వేధిస్తుంది. అక్కడ వరుసగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2-4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవటంతో ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. గత 23 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని భారత వాతావరణశాఖ తెలిపింది. కొద్ది రోజులు ఇదే పరిస్థితులు ఉంటాయని, వచ్చే రెండు రోజులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.