పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మునిసిపల్ ఇంచార్జి వైఎస్ మనోహర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్ వైఎస్ చైర్మన్ హఫీజ్ , మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తో కలిసి ఆయన ఇస్లాపురంలో పర్యటించి అక్కడ నెలకొన్న స్థల సమస్యలను అధికారతో కలిసి పరిష్కరించారు. అక్కడే కాలువలో ఉన్న వ్యర్థాలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.