డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో బుధవారం అష్టోత్తరపూజలు వైభవంగా జరిగాయి. ఏడు శనివారాల స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం మని భక్తులు భావిస్తారు. ఏడు శనివారాల స్వామివారి దర్శనం పూర్తయిన భక్తులకు అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు నేతృత్వంలో అష్టోత్తరపూజలు వైభవంగా జరిగాయి. అష్టోత్తరపూజలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.