ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలని పంచాయతీ కార్యదర్శిని జిల్లా పంచాయతీ అధికారి విజయ్కుమారెడ్డి ఆదేశించారు. ఓడిచెరువు మండలం కొండకమర్ల సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను వసూళ్లు సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రక్రియను వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్, సచివాలయ కార్యద ర్శులు శ్రీకాంత్, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa