విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జీ-20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు - 2023 ఏర్పాట్లపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్. జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), బీసీ సంక్షేమం ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్‌కుమార్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఇతర ఉన్నతాధికారులతో పాటు విశాఖ జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.