బీన్స్‌లో రాగి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రోటీన్ మరియు కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తింటే గొంతునొప్పి, కడుపునొప్పి, వాపు తగ్గుతాయి. బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ మెరుగుపడతాయి. ఇది ఇనుము లోపాన్ని కూడా నివారిస్తుంది. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, పాంటోథెనిక్ యాసిడ్ మరియు నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీన్స్ తినడం ద్వారా శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.