బంగాళదుంపను ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంగాళదుంపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు బంగాళదుంపలను అస్సలు తినకూడదు. బంగాళాదుంప తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. అంతేకాకుండా, అధిక రక్తపోటు ఉన్నవారు కూడా బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి. బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నందున బంగాళదుంపలు తక్కువగా తినాలి.