ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ కోణంలో చూడొద్దు...ఏపీ మంత్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 12:03 AM

జీవో నంబర్ 1ను రాజకీయ కోణంలో చూడొద్దని ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున  పేర్కొన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చామన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో సభల పేరుతో 11 మందిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.

పేద ప్రజల ప్రాణాల రక్షణకేజీవో నంబర్ 1ను రాజకీయ కోణంలో చూడొద్దని ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున  పేర్కొన్నారు. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టేవారి కోసం జీవో తీసుకొచ్చామన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో సభల పేరుతో 11 మందిని బలి తీసుకున్నారని మండిపడ్డారు.

పేద ప్రజల ప్రాణాల రక్షణకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిందని వారు వెల్లడించారు. ఈ జీవోకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. పేద ప్రజల రక్షణ కోసమే ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవోకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచించారా అని మంత్రి నాగార్జున దుయ్యబట్టారు.

ఇక, ఎవరూ అడగకుండానే విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి నాగార్జున తెలిపారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదన్నారు. విగ్రహం కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు.

ఇదిలావుంటే రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా? స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్‌ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే స్వాతంత్య్ర పోరాటం జరిగేదా అని నిలదీసింది. మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్‌ బెంచ్‌ .. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు హైకోర్టు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిందని వారు వెల్లడించారు. ఈ జీవోకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున గురువారం పరిశీలించారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. పేద ప్రజల రక్షణ కోసమే ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవోకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలన్నారు. పేదల కోసం జీవితంలో ఒక్కసారైనా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచించారా అని మంత్రి నాగార్జున దుయ్యబట్టారు.

ఇక, ఎవరూ అడగకుండానే విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి నాగార్జున తెలిపారు. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదన్నారు. విగ్రహం కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నాగార్జున వెల్లడించారు.

ఇదిలావుంటే రోడ్లపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా? స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్‌ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే స్వాతంత్య్ర పోరాటం జరిగేదా అని నిలదీసింది. మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్‌ బెంచ్‌ .. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రులు హైకోర్టు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com