ప్రముఖ సంస్థ ఓలా గతేడాది 1100 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిలో భాగంగా ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ లోని 200 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత సెప్టెంబర్ నుండే ఉద్యోగుల తొలగింపులపై సంస్థ సీఈఓ చర్చిస్తున్నారని, తాజా నిర్ణయం మేరకు సంస్థలోని ఐటీ ఉద్యోగులపై వేటు వేసినట్లు సమాచారం.