ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైనప్పడు అందరి పేర్లు బయట పెడతా: చికోటి ప్రవీణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 12:07 AM

ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతుందని, అవసరమైనప్పడు అందరి పేర్లు బయట పెడతా చికోటి ప్రవీణ్ వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. కోడి పందాలు, ఆటల పోటీలను వీక్షేందుకే తాను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చానని.. చికోటి ప్రవీణ్ వ్యాఖ్యానించారు. క్యాసినో విషయంలో తనపై వచ్చినవి ఆరోపణలే అని.. వాటిలో వాస్తవాలు లేవన్నారు. ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతుందని.. అందుకే అవసరమైనప్పడు అందరి పేర్లు తాను బయట పెడతానని ప్రవీణ్ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఏపీలో కోడి పందాలు ఆడామని.. ఇప్పుడు కూడా అందులో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. టీడీపీ లీడర్లు చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.


ఇటీవల.. హిందూ మతం, దేవుళ్లపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారికి మంచి బుద్ధి రావాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చికోటి ప్రవీణ్ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మను చికోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రవీణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చికోటి ప్రవీణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com