అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం హైవే కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దువ్వాడ మోహన్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. యూటర్న్ తీసుకుంటున్న ఆటోను కారు వచ్చి వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎలమంచిలి రూరల్ ఎస్సై సన్నిబాబు తెలిపారు. మృతుడు వివరాలు రాంబిల్లి మండలం రాజాల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో వ్యక్తికి గాయాలైనట్లుగా సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎలమంచిలి పోలీస్ అధికారులు తెలిపారు.