ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రమైన అచ్చంపేటలో శనివారం కొమ్మాలపాటి శ్రీధర్ పర్యటించారు. అచ్చంపేట ప్రధాన వీధుల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరిస్తూ తన పర్యటనను కొనసాగించారు. ఈ పర్యటనలో అచ్చంపేట మండల టిడిపి అధ్యక్షులు ఆశీర్వాదం, ఇతర నాయకులు పాల్గొన్నారు.